గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (15:02 IST)

దేశంలో విస్తారంగా వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

rain
దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో ఈ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలీలో 130 గ్రామాలు వర్షాల కారణంగా ఏర్పడిన వరద ముంపునకు గురయ్యాయి. 
 
ముఖ్యంగా, గడ్చిరోలితో పాటు మరాఠ్వాడా, ప్రాంతంలోని హింగోలి, నాందేడ్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించి, రెడ్ అలెర్ట్‌ ప్రకటించింది. 
 
అలాగే, ఉత్తరాఖండ్, తర్పు ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, గోవా, మరఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.