సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (08:26 IST)

తెలంగాణాలో నేడు - రేపు వర్షాలు

Rains
తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురువనున్నాయి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌పై సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడి నైరుతి దిశగా పయనిస్తుంది. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, మంగళ, బుధవారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ఆదివారం ఉదయం 8.30 నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 13.2 సెంటీమీటర్లు, పాతరాజంపేట(కామారెడ్డి)లో 12.8, పొచ్చెర(ఆదిలాబాద్‌)లో 10.4. నెన్నెల(మంచిర్యాల)లో 9.7, సోనాల(ఆదిలాబాద్‌)లో 9.4, జైనూర్‌(ఆసిఫాబాద్‌)లో 9.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 
 
ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా హైదరాబాద్‌ నగరంతోపాటు సంగారెడ్డి, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686 అడుగులకు చేరింది.