బుధవారం, 6 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 జులై 2022 (22:42 IST)

తెలంగాణలో కుమ్మేస్తున్న వర్షాలు.. అన్నదాత హర్షం

తెలంగాణలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలో విస్తరించడంతో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
జూన్ 4న రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్ గిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ పేటలో సాధారణ వర్షాలు నమోదు అవుతాయని..నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ జిల్లాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
గడిచిన 24 గంటల్లో ఉమ్మది ఆదిలాబాద్ జిల్లాల్లోని మంచిర్యాల, కుమ్రం భీం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల పట్ల అన్నదాత హర్షం వ్యక్తం చేస్తున్నాడు.