నా తమ్ముడు ఓ పొరికి... శశికళతో కుమ్మక్కై అత్తను చంపేశాడు: దీపా జయకుమార్
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కోసం అక్కాతమ్ముడు వీధికెక్కారు. జయలలిత ఆస్తులకు సంబంధించి వీలునామా తన వద్ద ఉందంటూ దీపా జయకుమార్ చెపుతుంటే.. కాదుకాదు ఆ వీలునామా తనవద్దే ఉందంటూ ఆమె సోదరుడు దీపక్ చెపుతున్నారు. ఈ ఆస్తి తగాదాలు వీరిద్దరిని రోడ్డున పడేలా చేశాయి.
ముఖ్యంగా, తన అనుచరులతో కలిసి పోయేస్ గార్డెన్‌కు వెళ్లిన ఆమెను వేదనిలయంలోకి వెళ్లకుండా ఆమె సోదరుడు దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా దీపా మాట్లాడుతూ తన మేనత్త జయలలితను శశికళతో కలిసి తన సొంత తమ్ముడు దీపక్ చంపేశాడని ఆరోపించారు. శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత)ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్‌తో చేతులు కలిపి తనను అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించారు.
పొయేస్ గార్డెన్‌కు రావాలని ఫోన్ చేసిన దీపక్ తాను అక్కడికి చేరుకున్న అనంతరం తనను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తన తమ్ముడు ఓ పొరికి అని అందుకే ఇలా నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు.