గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (09:09 IST)

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలి.. 10 మంది పిల్లల్ని కనాలి : వాసుదేవానంద్

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలంటే ప్రతి హిందూ మహిళ కనీసం 10 మంది పిల్లల్ని కనాలని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంస

భారత్‌లో హిందువుల జనాభా పెరగాలంటే ప్రతి హిందూ మహిళ కనీసం 10 మంది పిల్లల్ని కనాలని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి పిలుపునిచ్చారు. నాగ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ధర్మ సంస్కృతి మహాకుంబ్ జరిగింది.
 
ఈ మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొని "సేవ్ హిందూ" అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతీ హిందువు ఇక నుంచి 10 మంది పిల్లల్ని కనాలి.. దేవుడే వారిని రక్షిస్తాడు అంటూ హితబోధ చేశారు. హిందూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో గోవధను నిషేధించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు.