నిరక్షరాస్యులు టీకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
నిరక్షరాస్యులకు, నెట్ సౌకర్యం లేనివారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడి చర్యలపై జస్టిస్ డీ.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మేరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
టీకాలు మొత్తం కేంద్రమే ఎందుకు కొనడం లేదు? కేంద్రం, రాష్ట్రాలకు టీకా ధరల్లో తేడా ఎందుకుంది? జాతీయ టీకా విధానాన్ని పాటిస్తూ టీకాలను కేంద్రమే సేకరించి ఎందుకు పంపిణీ చేయట్లేదు? శ్మశానవాటిక సిబ్బందికి వ్యాక్సినేషన్‌పై ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది.