శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2016 (07:30 IST)

పక్కింటి వ్యక్తితో సంబంధం ఉందనీ భార్యపై యాసిడ్ పోసిన భర్త

అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

అనుమానం పెనుభూతమైంది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భావించిన భర్త... ఆమెపై యాసిడ్ పోసిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషాలోని కొంధమాల్ జిల్లాలోని డిమిరిగూడ అనే ప్రాంతంలో దంపతులు జీవిస్తున్నారు. అయితే, భార్యపై భర్తకు అనుమానం వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు మహిళపై యాసిడ్ పోశాడు. 
 
అది కూడా పడరానిచోట పడటంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. తర్వాత ఫూల్బనిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. దాడి చేసిన వెంటనే పరారైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు (సెక్షన్ 307) నమోదు చేశారు.