ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (17:28 IST)

సీఎంగా శశికళనా? మిలిటరీ తరహా కుట్ర... ఇంతకన్నా దురదృష్టం మరోటి ఉండదు : దీప

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనుండటం అంటే ప్రజలకు ఇంతకన్నా దురదృష్టం మరోటి ఉండదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన అన్నాడీఎంకే శాస

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనుండటం అంటే ప్రజలకు ఇంతకన్నా దురదృష్టం మరోటి ఉండదని ముఖ్యమంత్రి దివంగత జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో తమ పార్టీ నేతగా శశికళను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి పదవికి ఓ పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు.
 
ఈ పరిణామాలపై దీప స్పందించారు. తమిళనాడులో అధికారాన్ని చేపట్టేందుకు శశికళ బృందం మిలిటరీ తరహా కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. తమిళనాడుకు శశికళ ముఖ్యమంత్రి అవడం అంటే ప్రజలకు ఇంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదన్నారు. కాగా, శశికళ ఈనెల 7 లేదా 9 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 
 
అంతకుముందు.. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి ఓ.పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు. జయలలిత మరణించిన  రెండు నెలలకు శాసనసభా పక్ష నేతగా శశికళ ఎన్నిక కావడం గమనార్హం. సీఎం పదవిని చేపట్టాలని శశికళను పన్నీర్ సెల్వం కోరారు. శాసనసభా పక్ష తీర్మానాన్ని గవర్నర్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందించనున్నారు.