సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (15:49 IST)

జయ మృతిపై ఎంపీల రచ్చ.. అమ్మ డిసెంబర్ 5.. సాయంత్రం 4.30 గంటలకే చనిపోయారు.. ఓపీఎస్

తమిళనాట దివంగత సీఎం జయలలిత మృతిపట్ల పలు అనుమానాలున్నాయి. ఆమె మృతి పట్ల మిస్టరీ ఇంకా వీడలేదు. 75 రోజుల పాటు జయలలితను అపోలో ఆస్పత్రిలో ఉంచి... ఆమెను ఎవ్వరూ చూడనీయకుండా చేసిన శశికళపై ఇప్పటికీ పలువురూ ఫైర

తమిళనాట దివంగత సీఎం జయలలిత మృతిపట్ల పలు అనుమానాలున్నాయి. ఆమె మృతి పట్ల మిస్టరీ ఇంకా వీడలేదు. 75 రోజుల పాటు జయలలితను అపోలో ఆస్పత్రిలో ఉంచి... ఆమెను ఎవ్వరూ చూడనీయకుండా చేసిన శశికళపై ఇప్పటికీ పలువురూ ఫైర్ అవుతున్నారు. కానీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులు, ప్రభుత్వ వివరణ పట్ల ఓపీఎస్, జయమ్మ మేనకోడలు పన్నీర్ సెల్వం ఏమాత్రం సంతృప్తి చెందలేదు.
 
ఈ నేపథ్యంలో జయలలిత మృతి పట్ల ఎంపీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించారు. పన్నీర్ సెల్వం మద్దతుదారులైన ఎంపీలు రాజ్యసభలో జయలలిత మృతి అంశాన్ని లేవనెత్తారు. దానిపై విచారణ జరిపించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. జయలలిత మృతిపై ఇంత భారీ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నా.. విచారణకు ఎందుకు ఆదేశించడం లేదంటూ వారు ప్రశ్నించారు.
 
మరోవైపు జయలలిత మృతిపై విచారణ చేపట్టాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఇప్పటికే ఒకరోజు దీక్ష చేపట్టగా.. అమ్మ చికిత్సకు సంబంధించిన రిపోర్టులపై ఎవరు సంతకాలు చేశారని దీప జయకుమార్ ప్రశ్నించారు. 
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు చుక్కలు చూపించి.. ఆమెను జైలుకు పంపిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బుధవారం నాడు బాంబు పేల్చారు. జయ మృతిని చేధించాలని డిమాండ్ చేస్తూ దీక్షకు కూర్చున్న ఓపీఎస్.. జయలలిత మృతికి సంబంధించి తనకు డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం గం.6.30కు తెలిసిందని బాంబు పేల్చారు. 
 
అయితే ఆస్పత్రి వర్గాలు మాత్రం తన ప్రెస్ నోట్లో 5 డిసెంబర్ 2016 రాత్రి గం.11.30 నిమిషాలకు జయలలిత చనిపోయినట్లుగా ప్రకటించింది. పన్నీరు సెల్వం మాత్రం తనకు సాయంత్రం ఆరున్నరకే అమ్మ మృతిపై సమాచారం వచ్చేసిందన్నారు. జయలలిత ఆ రోజు సాయంత్రం గం.4.30 నిమిషాలకే చనిపోయినట్లుగా తెలిసిందని.. కానీ రెండు గంటలు ఆలస్యంగా.. ఆరున్నరకు చెప్పారని ఓపీఎస్ చెప్పుకొచ్చారు.