సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (10:36 IST)

పీఎస్ఎల్వీ-సీ38 రాకెట్ ప్రయోగం సక్సెస్.. చరిత్ర నెలకొల్పిన ఇస్రో

ఇస్రో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ 38 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం పీఎస్‌ఎల్‌వీ-సీ 38 వాహననౌకను ఇస్రో శాస్త్రవేత్తలు

ఇస్రో మరో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ 38 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం పీఎస్‌ఎల్‌వీ-సీ 38 వాహననౌకను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. భూపరిశీలక ఉపగ్రహం కార్టోశాట్-2తోపాటు వివిధ దేశాలకు చెందిన 30 నానో శాటిలైట్ల (ఉపగ్రహాలు)ను పీఎస్‌ఎల్‌వీ-సీ 38 వాహననౌక ద్వారా శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
 
కక్ష్యలోకి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ సహా 14 దేశాలకు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కార్టోశాట్-2 ఉపగ్రహంతో భూపరిశీలన సామర్థ్యం మెరుగుపడనుంది. కార్టోసాట్-2 ఉపగ్రహం బరువు 712 కిలోలు కాగా.. మిగిలిన 30 ఉపగ్రహాల బరువు 243 కిలోలు. ఉపగ్రహాలన్నీ 505 కిలోమీటర్ల ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఈ 30 ఉపగ్రహాల్లో ఆస్ట్రియా, బెల్జియం, చెక్ రిపబ్లిక్, ఫిన్ లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, లాత్వియా, లిథువేనియా, స్లొవేకియా, బ్రిటన్, ఆమెరికాలకు చెందిన 29 చిన్న ఉపగ్రహాలుండగా ఒకటి మాత్రం కన్యాకుమారిలోరి నూర్-ఉల్-ఇస్లాం యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించింది.
 
కాగా, (పీఎస్‌ఎల్‌వీ)- సీ38 ప్రయోగం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది. ఈ ప్రయోగంతో ఇస్రో చరిత్ర నెలకొల్పిందని శాస్త్రవేత్తలు తెలిపారు. గడచిన రెండు నెలల కాలంలో 50 రోజులు ఇస్రోకు చాలా క్లిష్టమైన సమయమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే ఈ 50 రోజులలో ఇస్రో మూడు అంతరిక్ష ప్రయోగాలు చేసిందని గుర్తుచేశారు. మూడు ప్రయోగాలు అత్యంత భారీ వ్యయంతో కూడినవని, ప్రతిష్టాత్మకంగా భావించి, మూడు పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఈ విజయం ఇస్రోకు మరింత స్ఫూర్తినివ్వగా, ఇస్రో ఖ్యాతిని మరింతగా పెంచిందని వారు అభిప్రాయపడ్డారు.