శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:12 IST)

జయలలితను దోషిగా ప్రకటించలేం.. రూ.100కోట్ల జరిమానాగా విధించలేం: సుప్రీం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖ

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా ప్రకటించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అక్రమాస్తుల కేసులో ఇటీవల ఇచ్చిన తీర్పును సవరించాలంటూ.. గత నెలలో కర్ణాటక సర్కారు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తోసిపుచ్చింది. జయలలితను దోషిగా తేల్చడంతో పాటు రూ.100 కోట్ల జరిమానా విధించాలని కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంను విజ్ఞప్తి చేసింది. 
 
ఇంకా జరిమానాను జయలలిత కూడబెట్టిన ఆస్తులను వేలం వేయడం ద్వారా వసూలు చేయాలని కర్ణాటక విజ్ఞప్తి చేసింది. కానీ ఈ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. ఆమె మరణించిన నేపథ్యంలో జరిమాన విధించడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. అయితే శశికళకు విధించిన జరిమానాను వసూలు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. 
 
కాగా, జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం రూ.2.79 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని జరిమానా విధించడం ద్వారా రాబట్టుకోవాలని కర్ణాటక విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.