బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (17:40 IST)

జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలి : డిప్యూటీ స్పీకర్

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు.

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు. బుధవారం త‌మిళ‌నాడు అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ఆయ‌న ఈ సూచ‌న‌లు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1992లో జ‌య‌లలిత ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఆడ‌శిశువుల హ‌త్య‌ల నివార‌ణ కోసం 'తొట్టిల్ కుళ‌ందైగ‌ళ్ తిట్టం (క్రెడిల్ బేబీ స్కీమ్‌)'ను ప్ర‌వేశ‌పెట్టారని గుర్తుచేశారు. అలాగే, ఇది మ‌ద‌ర్ థెరెసా ప్ర‌శంస‌లు అందుకున్న ప‌థ‌కమ‌న్న డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు. 
 
ఈ స్కీమ్‌ను తొలుత మొద‌ట సేలం పట్టణంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ఆ త‌ర్వాత రాష్ట్రం మొత్తానికి ఈ ప‌థ‌కాన్ని విస్త‌రించారు. దీంతో అక్క‌డి లింగ నిష్ప‌త్తిలో గ‌ణ‌నీయ‌ పెరుగుద‌ల క‌నిపించింద‌న్నారు. అందువల్ల జయలలిత పేరును నోబెల్ బహుమతికి సిఫార్సు చేయాలని ఆయన సూచించారు.