మంగళవారం, 8 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : శనివారం, 5 ఏప్రియల్ 2025 (19:03 IST)

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

Cinema theater
Cinema theater
ఈవారం విడుదలైన చిన్న సినిమాలన్నీ ఢమాల్ అన్నాయి. కారణం అంతా కొత్తవారయినా కథ, కథన విషయంలో చాలా పేలవంగా వున్నాయి. వర్మ సినిమా శారీ అంటూ ముందుకు వచ్చి అభాసుపాలయ్యాడు. షాట్ పిలింలా తీసిన సినిమాకు పెద్ద సినిమాకు ఇచ్చిన పబ్లిసిటీ ఇచ్చి కేష్ చేసుకోవాలనుకున్నా బెడిసికొట్టింది. దీనితోపాటు వ్రుషభ, శివాజ్జి, ఎ.ఎల్.వి. సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ పబ్లిసిటీ చేసేవారికి ఉపయోగపడేలావున్నాయి.
 
కానీ ప్రేక్షకులు మాత్రం నిరాశమిగిల్చాయి. దానికి కారణం ఏ సినిమాలో సరైన కంటెంట్ లేకపోగా, యూ ట్యూబ్ లో వచ్చే సినిమాలకన్నా ధారుణంగా వుండడమే కారణంగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. అయితే పనిలో పనిగా ఆర్య2, ఆదిత్య 369 సినిమాలు విడుదలయినా థియేటర్లు పెద్దగా లేకపోవడంతో ఉన్నంతలో జనాలు వాటిలోనే కనిపిస్తున్నారు. ప్రత్యేకత ఏమంటే  రెండు వారాల నాడు విడుదలైన మ్యాడ్ 2 సినిమాకు కలెక్లన్లు మరలా ఊపందుకోవడం విశేసం.