శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 5 ఏప్రియల్ 2025 (18:00 IST)

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

Nag Ashwin releasing a song from the movie Ari
Nag Ashwin releasing a song from the movie Ari
వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. "పేపర్ బాయ్" చిత్రంతో దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల Ph.D నిర్మిస్తున్న సినిమా.
 
‘అరి’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఈ సినిమా నుంచి 'భగ భగ..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను అనూప్ రూబెన్స్ ఫైర్ ఉన్న బీట్ తో కంపోజ్ చేయగా..వనమాలి పవర్ ఫుల్ లిరిక్స్ రాశారు. షణ్ముక ప్రియ, రోహిత్ పీవీఎన్ఎస్ ఇంటెన్స్ గా పాడారు. 'భగ భగ..' సాంగ్ ఎలా ఉందో చూస్తే - 'మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు, భగ భగ భగ భగ మండే నీలో ఏదో సెగ, అంతులేని ఏంటి దగా, మనిషేనా నువ్వు, ఏమైపోతున్నావు, మృగమల్లె మారి దిగజారి పోయావు..' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. అరి’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మూవీ టీమ్ అనౌన్స్ చేయనుంది.