ఆదివారం, 6 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఏప్రియల్ 2025 (18:23 IST)

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Neena Gupta
నీనా గుప్తా. ఈ బాలీవుడ్ సీనియర్ నటి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. అంతేకాదు ఏది చేసినా కూడా సంచలనమే. తన జీవితంలో ఓ క్రికెటర్‌తో సహజీవనం చేసి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఒంటరిగా వుండి బిడ్డకు పెళ్లి చేసింది. ఇక ఇటీవల ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ... భారతదేశంలో 95 శాతం మంది మహిళలకు శృంగారం అంటే అది ఒక ఎంజాయ్‌మెంట్ అని కూడా తెలియదు.
 
కేవలం పిల్లల్ని కనడానికే శృంగారం అనుకుంటూ వుంటారు. శృంగారం ద్వారా ప్లెజర్ అనుభవించవచ్చని చాలా కొద్దిమందికే తెలుసు. ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారని సినిమాల్లో చూపించేవారు. నేను కూడా అదే కదా నమ్మేదాన్ని. అలాంటి భ్రమలోనే నేను బ్రతికాను" అంటూ చెప్పుకొచ్చారు. నీనా గుప్తా చేసిన కామెంట్స్ పైన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
 
నీనాను ఉద్దేశిస్తూ.... మీరు నిజంగానే భ్రమలో వున్నారు. పిల్లల కోసం శృంగారం అనేది పోయింది, మీరు చెప్పినట్లు శృంగారంలో ప్లెజర్ అనుభవించడానికి భర్తను మర్డర్ చేసే రోజులు వచ్చాయని మీకు ఇటీవల జరుగుతున్న సంఘటనలు తెలియజేయడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.