ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (09:36 IST)

భారత సంతతి పౌరుల ప్రతిభకు పెద్దపీట.. వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా అజయ్ నామినేట్

ajay banga
అగ్రరాజ్యం అమెరికా తమ దేశంలో నివసిస్తున్న భారత సంతతి ప్రజల ప్రతిభను గుర్తిస్తుంది. దీంతో వారికి పెద్దపీట వేసేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడుగా భారత సంతతికి చెందిన అజయ్ బంగాను పేరును సిఫార్సు చేసింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే అమెరికాలో అనేక మంది భారత సంతతి ప్రతిభావంతులు కీలక బాధ్యతల్లో ఉన్న విషయం తెల్సిందే.
 
కాగా, ఇపుడు అజయ్ బంగా పేరును ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తూ అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది ఈయన గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ ఛైర్మెన్‌గా కొనసాగుతున్నారు. వ్యాపార, ఆర్థిక రంగంలో ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. మాస్టర్ కార్డుతో పాటు అమెరికన్ రెడ్ క్రాస్, క్రాఫ్ట్‌ ఫుడ్స్, డౌ ఐఎన్సీ సంస్థల్లో కీలక పదవులను సమర్థమంతంగా నిర్వహించి మంచి పేరు గడించారు.