సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (13:38 IST)

కోడికూర కోసం తండ్రీకొడుకుల డిష్యూం డిష్యూం.. కుమారుడు హతం

chicken
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కోడికూర కోసం తండ్రీ కొడుకులు గొడవపడ్డారు. దీంతో క్షణికావేశంలో కుమారుడిని తండ్రి కర్రతో కొట్టడంతో చనిపోయాడు. కుమారుడు ఇంటికి వచ్చేలోపు కోడికూరను తండ్రి తినేశాడు. దీంతో ఆగ్రహంచిన కుమారుడు... తండ్రితో గొడవకు దిగడంతో ఈ దారుణం జరిగింది.

తాజాగా వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా సునీయా తాలూకా గుత్తికర్ గ్రామానికి షీనా, శివరామన్ అనే తండ్రీ కుమారులు ఉన్నారు. మంగళవారం ఇంట్లో వండిన కోడికూరను షీనా తినేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చిన కొడుకు శివరామన్ తెలిసి ఆగ్రహంతో తండ్రితో గొడవపడ్డారు.

ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన షీనా.. శివరామన్‌‌ను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శివరామన్ ఘటనా స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారితీసింది.