బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:45 IST)

రిజర్వాయర్లలో నీళ్లు లేవు... అవి మాకేచాలవు... తమిళనాడుకేమిస్తాం?: కర్ణాటక

కావేరీ జలాలపై కర్నాటక ప్రభుత్వం మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ రిజర్వాయర్లో తగినంత నీళ్లు లేవనీ, ఉన్న నీటినే బెంగుళూరుతో పాటు... ఇతర నగరాలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నం

కావేరీ జలాలపై కర్నాటక ప్రభుత్వం మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ రిజర్వాయర్లో తగినంత నీళ్లు లేవనీ, ఉన్న నీటినే బెంగుళూరుతో పాటు... ఇతర నగరాలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నందున తమిళనాడు రాష్ట్రానికి నీరు అందించలేమని కర్నాటక వాదిస్తోంది. అందువల్ల ఈ నెల 20వ తేదీన ఇచ్చిన ఆదేశాలను సవరించాలంటూ కర్ణాటక ప్రభుత్వం సోమవారం సుప్రీంను ఆశ్రయించింది. 
 
కాగా, తమిళనాడు రాష్ట్రానికి రోజూ ఆరువేల క్యూసెక్కుల కావేరీ జలాల విడుదల చేయాలంటూ ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే. దీంతో తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలను సవరించాలంటూ తమ రిజర్వాయర్లలో నీళ్లు లేవనీ, బెంగళూరు, ఇతర నగరాలకు మంచినీటిని సరఫరా చేయలేని పరిస్థితిలో ఉన్నందున తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక తన తాజా వ్యాజ్యంలో తెలిపింది. 
 
మరోపక్క 20న ఇచ్చిన ఉత్తర్వులు పునఃపరిశీలించాలని కోరుతూ కర్ణాటక న్యాయవాదులు కూడా మరో వ్యాజ్యం వేశారు. ఈ రెండు వ్యాజ్యాలు మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చే అవకాశం ఉంది.