ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (13:20 IST)

గొడ్డు మాంసం తిన్నారుగా.. చూశారా.. కేరళ ఏమైందో? బసన‌గౌడ్

కేరళలో జల ప్రళయానికి కారణం అయ్యప్ప స్వామినేనని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళను వరదలు అల్లకల్లోలం చేశాయి. ఇందుకు అయ్యప్ప స్వామి శాపమే కారణమని, హరిహరుల సుపుత్రుడి

కేరళలో జల ప్రళయానికి కారణం అయ్యప్ప స్వామినేనని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళను వరదలు అల్లకల్లోలం చేశాయి. ఇందుకు అయ్యప్ప స్వామి శాపమే కారణమని, హరిహరుల సుపుత్రుడి కోపంతోనే కేరళ జలదిగ్భంధంలో మునిగిందని వారు అంటున్నారు. ప్రజలు కూడా దీన్ని నమ్ముతున్నారు. 
 
సాధారణంగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కోసం 41 రోజుల పాటూ కఠినమైన నియమాలతో దీక్షలు చేసిన భక్తులు 18 మెట్లు ఎక్కుతారు. స్వామిని  దర్శించుకుంటారు. అయితే స్వామివారి దర్శనానికి ఆడవారికి ఆంక్షలున్నాయి. పదేళ్ల నుంచి 50 యేళ్ల మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధమన్న సంగతి తెలిసిందే. కానీ ఇటీవల మహిళలకు కూడా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వల్లే కేరళలో వరదలు వచ్చాయని ప్రజలు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో.. కేరళలో వరదలు ఎందుకొచ్చాయో అనేందుకు బీజేపీ నేతలు కొత్త వివరణ ఇచ్చారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో బీజేపీ నేతలు ముందుంటారు. తాజాగా.. మరో ఎమ్మెల్యే ఈ జాబితాలో చోటుదక్కించుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ మీద కామెంట్ చేసి.. వివాదంలో చుక్కుకున్నారు.
 
భారీ వర్షాలు, వరదలతో కేరళకు తగిన శాస్తి జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ తెలిపారు. దేవభూమిగా పేరొందిన గడ్డపై ఆవు మాంసం తినడంతోనే ఇంతటి ప్రకృతి విపత్తుకు గురైందని వ్యాఖ్యానించారు. పశుమాంసం తినేవారెవరైనా దేవుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కేరళలో ఏం జరిగిందో చూడండి అంటూ కామెంట్ చేశారు. 
 
దేవ భూమిగా పేరొందిన చోట విచ్చలవిడిగా ఆవు మాంసం విక్రయాలు చేశారు. బీఫ్‌ ఫెస్టివల్‌తో విర్రవీగారు. ఆ ఫెస్టివల్‌ చేసుకున్న ఏడాదిలోనే ఇంతటి ప్రకృతి విలయం సంభవించిందని బసవగౌడ ఎద్దేవా చేశారు. కాగా, పశు మాంసం అమ్మకాలను నిషేదిస్తూ 2017లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా కేరళకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీఫ్‌ ఫెస్టివల్‌ పేరిట కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. 
 
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి లావణ్య స్పందించారు. ప్రజల్ని రెచ్చగొట్టే, వారి మనోభావాలు దెబ్బతీసేలా మట్లాడడం బీజేపీ నేతలు మానుకుంటే మంచిదని హెచ్చరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా ప్రకృతి విపత్తులు సంభవించాయన్నారు. ప్రజల అలవాట్లతో ప్రకృతి విధ్వంసానికి ముడి పెట్టొద్దని హితవు పలికారు.