బంగారం స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ అరెస్ట్
కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌కు జాతీయ దర్యాప్తు సంస్ధ ప్రత్యేక కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కరోనా నేపద్యంలో ప్రత్యేకంగా వీరిని కోవిడ్ టెస్టుల అనంతరం వచ్చేన రిపోర్టు ఆధారంగా ఎన్ఐఏ తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తుంది. స్వప్న సురేష్ కోసం గాలిస్తున్న తరుణంలో ఈమేను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ బెంగళూరులో అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో ఇది రెండో అరెస్టు. స్వప్న సురేష్‌తో పాటు సందీప్ నాయర్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. స్వప్న సురేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళితే
తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ కాన్సులేట్‌కు చెందిన పార్శిల్లో 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని జులై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. దీంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించారు. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ నిందితురాలుగా గుర్తించారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పలు ఆరోపణలు రావడంతో కేరళ సీఎం పినరయి విజయన్ ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంతో జాతీయస్థాయి కేసుగా మారి సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో స్వప్న సురేష్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ వేగవంతం చేసి కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.