సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 జులై 2024 (13:29 IST)

చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళితే లిఫ్టులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు...

deadbody
కేరళ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆస్పత్రికి తీసుకెళితే అక్కడ దురదృష్టం వెంటాడింది. ఆ రోగి లిఫ్టులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రెండు రోజుల తర్వాత సిబ్బంది గుర్తించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉళ్లూర్ ప్రాంతానికి చెందిన రవీంద్రన్ నాయర్ (59) శనివారం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి వెళ్లారు. అవుట్ పేషెంట్ బ్లాక్ లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా అదేసమయంలో లిఫ్టులో సమస్య తలెత్తి ఆగిపోయింది. లిఫ్టు తలుపులు తెరుచుకోకపోవడంతో రవీంద్రన్ భయంతో కేకలు వేశారు. లిఫ్ట్ లోపల ఉన్న అలారం నొక్కినా, ఎమర్జన్సీ నంబర్లకు కాల్ చేసినా ఎవ్వరూ స్పందించలేదు. 
 
దీనికితోడు మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తన పరిస్థితి గురించి ఎవరికీ చెప్పే అవకాశం లేకపోయింది. చివరకు సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ అటు వచ్చారు. అదే సమయంలో రవీంద్రన్ అలారం మోగించడంతో లోపల ఎవరో ఉన్నట్లు గుర్తించారు. రవీంద్రన్ సాయంతో ఆపరేటర్ లిప్టు తలుపులను బలవంతంగా తెరిచారు. 
 
దీంతో ఆయన సురక్షితంగా బయటికొచ్చారు. అంతకు ముందు రవీందర్ ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాత్రి అతడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు లిఫ్ట్ ఆపరేటర్లతో పాటు డ్యూటీ సార్జెంట్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.