శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 జూన్ 2020 (12:11 IST)

జిమ్ జోంగ్ ఉన్ సంచలనం నిర్ణయం.. కారణం బెలూన్లే..

ఉత్తర కొరియా అధ్యక్షుడు జిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దక్షిణకొరియాతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. తమ శత్రు దేశంతో భవిషత్య్తులో ఎలాంటి సంబంధాలు ఉండబోవని తేల్చి చెప్పేశారు.

ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గాలిబుడగలు అట. దక్షిణ కొరియాలో నివసిస్తున్న కొంతమంది నిరసనకారులు, ఉత్తర కొరియా నుంచి వలస వచ్చిన వారు కిమ్‌ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ.. సరిహద్దుల్లో బెలూన్లు ఎగురవేశారు. దాంతో పాటు కిమ్‌ను దుయ్యబడుతూ కరపత్రాలను గాల్లోకి విసిరారు. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది.
 
ఉత్తరకొరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దు మీదుగా వస్తున్న గాలిబుడగల కరపత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాంగ్యాంగ్‌లోని చెప్పారు. ఈ నిర్ణయం వెనుక కిమ్‌ సోదరి కిమ్‌ మో జోంగ్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జే-ఇన్‌ మధ్య 2018లో మూడు సార్లు చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయిన సంగతి తెలిసిందే.