శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 మే 2020 (16:31 IST)

దక్షిణ కొరియా- మళ్లీ మూతబడిన 250 పాఠశాలలు..ఎందుకంటే?

దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరగడంతో అక్కడ తెరుచుకున్న 200కి పైబడిన పాఠశాలలు రెండు రోజుల్లోనే మళ్లీ మూతపడ్డాయి. గత 24 గంటల్లో 56 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో.. ప్రజలు ఎక్కువ తిరగడం కారణంగా వైరస్ సంఖ్య పెరుగుతుందని గమనించిన అధికారులు.. తెరుచుకున్న పాఠశాలలను తిరిగి మూసివేశారు.
 
దక్షిణ కొరియాకు చెందిన కూపాంగ్‌ గిడ్డంగిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనాయి. పుచ్చియోన్ ప్రాంతంలో వున్న ఈ గిడ్డంగిలో పనిచేసే కార్మికులకు, దుస్తుల నుంచి, చెప్పుల నుంచి కరోనా వైరస్ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో బుచ్చియోన్ ప్రాంతంలో ఇదివరకే ప్రారంభమైన 251కి పైబడిన పాఠశాలలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తిరిగి మూతబడ్డాయి. దక్షిణ కొరియా రాజధానిలో ఇప్పటికే ఓ విద్యార్థికి కరోనా సోకింది. ఆ విద్యార్థి తల్లి కూపింగ్ గిడ్డంగిలో పనిచేస్తున్నారనడం గమనార్హం.