బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (13:25 IST)

ఆర్జేడీ యువరాజు ప్రతాప్ యాదవ్‌కు.. ఆమెతో వివాహం.. ఎవరామె?

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. బీహార్ యువరాజుగా ఆర్జేడీ కార్యకర్తలు, అభిమానులతో ప్రశంసలందుకుంటున్న తేజ్ ప్రతాప్ యాదవ్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నారు. ఈ నెలాఖరున వీ

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌  ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. బీహార్ యువరాజుగా ఆర్జేడీ కార్యకర్తలు, అభిమానులతో ప్రశంసలందుకుంటున్న తేజ్ ప్రతాప్ యాదవ్ త్వరలో పెళ్లి కొడుకు కానున్నారు. ఈ నెలాఖరున వీరి నిశ్చితార్థం, వచ్చే నెలలో వీరి వివాహం అట్టహాసంగా జరుగనుంది. ఇక ఈ యువజంట వివాహం పాట్నాలోని వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరుగుతుందని ప్రచారం సాగుతోంది. 
 
ఇక తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కాబోయే భార్య ఎవరో తెలుసా.. బీహార్ మాజీ సీఎం ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యారాయ్. తొలుత పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు సంబంధాలు చూడటం మొదలెట్టిన లాలూ దంపతులు.. రాష్ట్రానికి చెందిన రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని ఖరారు చేశారు. ఐశ్వర్యరాయ్ ఢిల్లీ యూనివర్శిటీలో హిస్టరీ గ్రాడ్యుయేట్. 
 
ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్ లాలూ ప్రసాద్ యాద‌వ్‌కు సుదీర్ఘకాలంగా మిత్రుడు. ఆర్జేడీ తరఫున ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. క్యాబినేట్‌లో ఆయన మంత్రిగానూ పనిచేశారు. ఐశ్వర్య తాతయ్య ప్రసాద్ రాయ్ 1970వ దశకంలో బీహార్‌కు 11 నెలల పాటు సీఎంగా కూడా పనిచేశారు. బీహార్‌లో తొలి యాదవ ముఖ్యమంత్రి కూడా ఆయనే కావడం విశేషం.