బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (15:27 IST)

గేటు వెలుపుల సింహాలు, గేటు లోపల శునకాలు.. ఏం జరిగింది? (వీడియో)

Lion
Lion
రెండు సింహాలు, రెండు పెంపుడు శునకాల మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక గేటు మాత్రమే వాటిని వేరు చేయడంతో, జంతువులు దాదాపు ఒక నిమిషం పాటు ఘర్షణ పడ్డాయి. చివరికి సింహాలు శునకాలతో పోరాటం వద్దనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. 
 
సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ ఫుటేజ్ గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలోని సావర్‌కుండ్లాలో జరిగింది. గిర్ నేషనల్ పార్క్ నుండి 76 కి.మీ దూరంలో వున్న ఒక ఇంటి ముందు రెండు సింహాలు సంచరించాయి. వాటిని చూసిన శునకాలు మొరగడం ప్రారంభించాయి. వాటిని అక్కడ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాయి.
 
గేటు వెలుపుల సింహాలు, గేటు లోపల శునకాలు నువ్వా నేనా అంటూ ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో గేటు విరిగింది. అయినా శునకాలు, సింహాల ఘర్షణ తగ్గలేదు. చివరికి శునకాలు కాస్త తగ్గడంతో సింహాలు పొదల్లోకి వెళ్లిపోయాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.