మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 మే 2020 (09:29 IST)

హిమాచల్‌ ప్రదేశ్‌ లో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తి నివారణ లాక్‌డౌన్‌ను మరో ఐదువారాలు పొడిగిస్తున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని సడలింపులతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ 4.0 కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

అయితే వచ్చే నెల చివరి వరకు అంటే జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నటు బిజెపి నేతృత్వంలోని జైరాం ఠాకూర్‌ ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు 210 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఐదుగురు మరణించారు.

ఒక్క హమరిపూర్‌ జిల్లాలోనే నాలుగో వంతు కేసులు నమోదయ్యాయి. హిమర్‌పూర్‌లో 63 కేసులు నమోదు కాగా, సోలన్‌లో 21 కేసులు నమోదు అయ్యాయి.