సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (11:43 IST)

తీర్థంలో మత్తు మందు ఇచ్చి అత్యాచారం.. పూజారికి లుక్ అవుట్ నోటీసు

Priest
Priest
చెన్నైలోని ప్రముఖ శక్తి ఆలయం కాళికాంబాల్ దేవాలయం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఇందుకు కారణం ఆ ఆలయ పూజారి చేసిన రాసలీలలే. ఆలయానికి వచ్చే భక్తురాలిని వివాహం చేసుకుంటానని మోసం చేసిన పూజారికి ప్రస్తుతం లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యింది. 
 
పూజారి మునుస్వామి అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు. ఈ నేపథ్యంలో అతడు విదేశాలకు పారిపోయే అవకాశం వున్నందున.. లుక్ అవుట్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో విచారణ జరిపేందుకు అర్చకుడు కాళిదాస్‌తో సహా ఐదుగురు సభ్యులతో కూడిన ఆలయ నిర్వాహకులకు పోలీసులు సమన్లు జారీ చేసింది. 
 
కాళికాంబాల్ ఆలయంలో అర్చకుడిగా పనిచేసిన కార్తీక్ మునుస్వామి తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చాడని.. ఆపై మత్తులోకి జారుకున్నాక యాంకర్ అయిన మహిళపై అకృత్యానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.