శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (10:58 IST)

ఆర్సీబీ ఓటమిపై అంబటి రాయుడు.. సంబరాలతో కప్పు గెలవలేరు..

ambati rayudu
ఆర్సీబీ ఓటమిపై మాజీ క్రికెటర్ అంబటి రాయడు తీవ్ర విమర్శలు గుప్పించాడు. సంబరాలు, దూకుడుతో ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేరని ఎద్దేవా చేశాడు. కీలక మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే కప్పు గెలవగలమని సెటైర్లు విసిరాడు. 
 
ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్కే‌పై ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయానంతరం ఆర్సీబీ జట్టుతో పాటు అభిమానులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. దీనిని ఉద్దేశించి సంబరాలతో ట్రోఫీలను గెలవలేరని చెప్పాడు. టైటిల్ సాధించాలంటే ప్లేఆఫ్స్‌లో బాగా ఆడాలని హితవు పలికాడు. అయితే రాయుడు వ్యాఖ్యలను ఆర్సీబీ అభిమానులు తప్పుబడుతున్నారు.
 
ఇకపోతే.. ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ సీజన్‌లో ఓ దశలో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒకే విజయం సాధించిన ఆర్సీబీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. 
 
వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కానీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.