ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 24 నవంబరు 2024 (20:19 IST)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

Woman Fire
హర్యానాలోని సోనిపట్‌లో కుటుంబ కలహాల కారణంగా తన లైవ్-ఇన్ భాగస్వామిని ఓ వ్యాపారవేత్త హత్య చేశాడు. తన ప్రేయసిని కత్తితో పొడిచి, ఆమె శరీరానికి నిప్పంటించాడు. దీంతో నిందితుడైన వ్యాపారవేత్తను అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
 
భర్తతో విడిపోయి ఆరేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న సరితను అక్టోబర్ 25న సివిల్ లైన్స్ ఏరియాలోని రిషి కాలనీలో ఉపకార్ అనే వ్యక్తి హతమార్చి, అగ్ని ప్రమాదంలో ఆమె చనిపోయినట్లు చిత్రీకరించాడు. ఈ క్రమంసో ఇల్లు మొత్తం తగలబెట్టాడని పోలీసులు తెలిపారు. 
 
ఉపకార్ భార్యకు భర్త సహజీవనం చేస్తున్న సంబంధం గురించి తెలుసు. సరిత 2004లో తన భర్తతో విడాకులు తీసుకుంది. ఉపకార్, సరిత ఆరేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. యమునానగర్‌లోని విష్ణు నగర్‌కు చెందిన ఉపకార్ అనే వ్యక్తి తన సహజీవన భాగస్వామిని హత్య చేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది.