గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 16 నవంబరు 2024 (15:59 IST)

నన్ను ప్రేమించకపోతే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ చేస్తా: యువతికి ప్రేమోన్మాది బెదిరింపులు

injection
ప్రేమోన్మాదుల అరాచకాలను అణచివేసేందుకు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా వారు మాత్రం పెట్రేగిపోతూనే వున్నారు. తాజాగా నాగార్జునసాగర్ కి చెందిన విజయ్ కుమార్ అనే ప్రేమోన్మాది ఓ యువతిని భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నాడు. దీనితో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
 
విజయ్ కుమార్ అనే వ్యక్తి తనను ట్రాప్ చేసాడనీ, గతంలో అతడితో దిగిన ఫోటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అతడు మోసగాడు అని తెలియడంతో దూరం పెట్టిన దగ్గర్నుంచి కాలేజీకి వెళ్లే దారిలో తనపై దాడికి ప్రయత్నిస్తున్నాడనీ, తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె కన్నీరు పెట్టుకుంది.
 
అసలు నిజాలు చెబితే... తన తల్లిదండ్రులను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని వాపోయింది. ప్రస్తుతం తను తన తల్లిదండ్రులు లేకుండా బయటకు వెళ్లాలంటే భయం వేస్తుందనీ, తనలా మరో ముగ్గురు యువతులను అతడు మోసం చేసాడని పోలీసులకు తెలిపింది బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.