బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 నవంబరు 2024 (21:38 IST)

రాయలసీమ ప్రేమకథలో అఖిల్ అక్కినేని.. డైరక్టర్ ఎవరంటే?

Agent, Akhil
బాక్సాఫీస్ వద్ద డీలాపడిన "ఏజెంట్" విడుదలైనప్పటి నుండి అఖిల్ అక్కినేని’ ఏడాదిన్నర కాలంగా తన తదుపరి చిత్రంపై శ్రద్ధ పెట్టలేదు. అయితే, అఖిల్ తదుపరి ప్రాజెక్ట్ గురించి సస్పెన్స్ ఎట్టకేలకు కొత్త అప్‌డేట్‌తో వీడింది.
 
అఖిల్ తన తర్వాతి సినిమాను లవ్ స్టోరీ నేపథ్యంగా ఎంచుకున్నాడు. రాయలసీమకు చెందిన ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గత సంవత్సరం 'వినరో భాగ్యం విష్ణు కథ'తో  అరంగేట్రం చేసిన 'మురళీ కిషోర్ అబ్బురు' దర్శకత్వం వహించనున్నారు.
 
మల్టీప్లెక్స్ ప్రేక్షకులతో అఖిల్ సినిమాలు కనెక్ట్ అవుతూ వచ్చాయి. అయితే రాయలసీమ నేపథ్యంలో వచ్చే తదుపరి సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాలలో మాస్ మార్కెట్‌తో అఖిల్ కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. 
 
విక్రమ్ కె. కుమార్‌తో ‘హలో’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని హోమ్ ప్రొడక్షన్, ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. అదనంగా, సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ 'ఎస్ఎస్ థమన్' చిత్రానికి తన మ్యూజికల్ టచ్ తీసుకురానున్నారు.