ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (15:47 IST)

దారుణం : బ్లడ్ కేన్సర్ బాలికపై అత్యాచారం

బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. బ్లడ్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సరోజినీ నగర్‌కు చెందిన 15 యేళ్ళ బాలిక ఒకరు బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. అయితే, బాలికకు ఆకలిగా ఉండటంతో హోటల్‌కు ఏదైన తినాలని భావించింది. దీంతో తనకు తెలిసిన శుభమ్ అనే వ్యక్తిని హోటల్‌కు తీసుకెళ్లమని ప్రాధేయపడింది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో శుభమ్ ఆ బాలికను తీసుకొని బయటకు బయలుదేరాడు. 
 
వీరితోపాటు శుభమ్ స్నేహితుడు కూడా వచ్చాడు. ఈ ముగ్గురు నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే, ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. తెలిసిన వ్యక్తి చేతిలో మోసపోయిన ఆమె ఎలాగొలా రోడ్డు వద్దకు చేరుకుంది. 
 
ఆసమయంలో అటుగా వచ్చిన ఓ స్కూటరిస్టును లిఫ్టు అడగ్గా, అతను కూడా ఏమాత్రం కనికరం చూపకుండా ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆరు గంటల వ్యవధిలో ముగ్గురు చేతిలో ఆ యువతి అత్యాచారనికి గురైంది. 
 
చివరికి ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న శుభమ్, సుమిత్‌ల కోసం గాలిస్తుండగా, రెండోసారి అత్యాచారానికి పాల్పడిన వీరేంద్ర యాదవ్‌ అనే కామాంధుడిని మాత్రం అరెస్టు చేశారు.