శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (16:21 IST)

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. ఉజ్బెక్ మహిళపై కారులో గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన ఒకటి జరిగింది. ఉజ్బెకిస్థాన్ మహిళపై కారులో గ్యాంగ్ రేప్ జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సామాహిక అత్యాచారం వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ తరహా ఘటన ఒకటి జరిగింది. ఉజ్బెకిస్థాన్ మహిళపై కారులో గ్యాంగ్ రేప్ జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ సామాహిక అత్యాచారం వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ ఢిల్లీలో నివశిస్తోంది. ఆమె సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో షాపింగ్ కోసం సాకేత్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ షాపింగ్ పూర్తయ్యాక ఆమె తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరింది.
 
మార్గమధ్యంలో ఆటోలో సాంకేతిక లోపం తలెత్తడంతో... ఆమెను దించేసిన ఆటో డ్రైవర్ మరో వాహనంలో వెళ్లమని సలహా ఇచ్చాడు. పది నిమిషాల తర్వాత తెల్లకారు వచ్చి ఆమె పక్కన ఆగింది. ఇందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, సౌత్ ఢిల్లీలోని వసంత్ కుంజ్ వద్ద కారులోనే ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఖిర్కీ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో ఆమెను వదిలివెళ్లారు. ఆ తర్వాత ఆమె జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.