శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (10:27 IST)

ఉడికించిన బీట్‌రూట్‌ గుజ్జును మెడకు రాసుకుంటే?

బీట్‌రూట్‌తో అందాన్ని పెంపొందింపచేసుకోవచ్చు. బీట్‌రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టంచి స్క్రబ్ చేయడం ద్వారా ముఖంపై వున్న బ్లాక్ హెడ్స్ నివారించబడతాయి. రెండు చెంచాల బీట్‌రూట్ రసంలో ఒక

బీట్‌రూట్‌తో అందాన్ని పెంపొందింపచేసుకోవచ్చు. బీట్‌రూట్ రసం, షుగర్ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి పట్టంచి స్క్రబ్ చేయడం ద్వారా ముఖంపై వున్న బ్లాక్ హెడ్స్ నివారించబడతాయి. రెండు చెంచాల బీట్‌రూట్ రసంలో ఒక చెంచా పెరుగును కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలతో పాటు వాటి తాలూకు మచ్చల్ని కూడా పూర్తిగా నివారిస్తుంది. ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడభాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. 
 
బీట్ రూట్ జ్యూస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది. బీట్ రూట్ పేస్ట్‌లో కొద్దిగా పాలు మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఒక టీస్పూన్ బీట్‌రూట్ జ్యూస్‌కు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే చర్మంలో కాంతి వస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.