1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

మతాన్ని మార్చుకుని హిందూ మహిళను పెళ్లాడిన ముస్లిం

mohammad nissar
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తి తన ప్రియురాలి కోసం మతాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలో ఆమెను మనువాడారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన మహ్మద్ నిరాస్ అనే వ్యక్తి ముస్లిం మతస్తుడు. అయితే, ఈయనకు ఆది నుంచి హిందూమతం, హిందూ ఆచారాలపై ఆసక్తి ఉండేది. 
 
ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం రాణి కాయస్థతో పరిచయం ఏర్పడింది. కాల క్రమంలో ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ వెళ్లి చేసుకోవాలని భావించారు. తొలి నుంచీ మహ్మద్‌ నిసార్‌కు హిందూ ఆచారాల పట్ల ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే హిందూ మతాన్ని స్వీకరించాడు. వేదమంత్రాల మధ్య మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. 
 
అనంతరం పండితులు మహ్మద్‌ నిసార్‌ పేరును సోనూ సింగ్‌గా మార్చారు. ఆ తర్వాత ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. భవిష్యత్‌లోనూ హిందువుగా కొనసాగుతానని స్పష్టంచేశాడు. మందసౌర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగో సారి. ఇక్కడ మొత్తం నలుగురు వ్యక్తులు హిందూ మతంలోకి మారారు.