ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఆగస్టు 2018 (11:28 IST)

మైనర్‌ బాలికపై ఐదుగురు వ్యక్తులు రేప్.. ఇద్దరు పోలీసులు కూడా?

రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత

రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిందితులుగా మారారు. జార్ఖండ్‌లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే దారుణానికి పాల్పడ్డారు. మైనర్ బాలికపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా వున్నారని బాధితురాలు ఆ రాష్ట్ర సీఎం రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై సీఎం రఘుబర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. సీఎం నిన్నటి సిద్ది బాత్ కార్యక్రమంలో జంషెడ్‌పూర్‌కు చెందిన బాలిక ఈ ఫిర్యాదు చేసింది. ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జీ, డీఎస్‌పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో పేర్కొంది.
 
సీఎం ఆదేశానుసారం చర్యలు చేపట్టిన జంషెడ్‌పూర్ ఎస్పీ అనూప్ స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జూడిషియల్ కస్టడీకి తరలించినట్లు పేర్కొన్నారు. బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.