సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (15:14 IST)

మధ్యప్రదేశ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. 2 రోజుల పాటు..?

మధ్యప్రదేశ్‌లోని సహదోల్‌ జిల్లాలో ఓ యువతి (20)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు నరకం చూపించారు. నిందితుల్లో జైత్‌పుర్‌ మండల భాజపా నేత విజయ్‌ త్రిపాఠీ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంపై వచ్చిన నలుగురూ ఆమెను అపహరించి గడఘాట్‌ ప్రాంతంలోని ఓ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లారు. 
 
ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. రెండు రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసి దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెను ఇంటి ముందు వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు అదనపు ఎస్పీ ముఖేశ్‌ వైశ్‌ తెలిపారు. కాగా త్రిపాఠీని వెంటనే పార్టీ నుంచి తొలగించినట్లు భాజపా ప్రకటించింది.
 
అలాగే మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. జబల్‌పుర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఐదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు కుందామ్‌ ఠాణా పోలీసులు తెలిపారు. దుకాణానికి వెళ్లిన బాలికను తీసుకెళ్లి అతను దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు