శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (15:33 IST)

తండ్రి చేసిన అప్పులు కూడా చెల్లించాల్సిందే : మద్రాస్ హైకోర్టు

తండ్రి మరణానంతరం ఆయన సంపాదించిన ఆస్తులు పంచుకోవడమే కాకుడా, ఆయన చేసిన అప్పులు కూడా వారసులు చెల్లించాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

తండ్రి మరణానంతరం ఆయన సంపాదించిన ఆస్తులు పంచుకోవడమే కాకుడా, ఆయన చేసిన అప్పులు కూడా వారసులు చెల్లించాల్సిందేనంటూ మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, తండ్రి మరణానంతరం సంక్రమించే ఆస్తులతో పాటు తన అప్పులను కూడా వారసులు తీర్చాలని స్పష్టం చేసింది. తన తండ్రి నివాసంలో పనిచేస్తూ మరణించిన ఓ కార్మికుడి కుటుంబానికి చెల్లించని నష్టపరిహారాన్ని ఆయన తనయుడు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. 
 
తీర్పు సందర్భంగా జస్టిస్ ఎస్ వైద్యనాథన్ మాట్లాడుతూ..."మన పురాణ ధర్మశాస్త్రాల్లో నైతిక బాధ్యతల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారం, రుణం చెల్లించకపోవడం పాపం కిందకు వస్తుంది. అది పై లోకంలో తీవ్ర నరకానికి గురిచేస్తుంది. రాముడి తన తండ్రి మాటకు కట్టుబడిన రీతిలో పిటిషనర్‌కి బాధిత కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంది" అని అన్నారు.