బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:45 IST)

మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రికి కరోనా పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతీరోజూ ఇరవై వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. సామాన్యులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా వరుసగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా మరో మహారాష్ట మంత్రి కరోనా బారినపడ్డారు. మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్‌కు కరోనా సోకినట్టు స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. ఫలితాల్లో పాజిటివ్ అని తేలిందని అన్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. తాను హోం క్వారంటైన్‌లో ఉన్నానని తెలిపారు. ఇప్పటివరకూ 12 మంది మహారాష్ట్ర మంత్రులు కరోనా బారినపడ్డారు.
 
మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటలలో 80,472 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,179 మంది మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62,25,763గా ఉంది.