శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (22:54 IST)

దంపతుల మధ్య దాపరికాలు.. భార్యకు తెలియకుండా సెటప్ చేశాడు.. చివరికి?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. దంపతుల మధ్య అన్యోన్యత కరువైంది. ఇందుకు స్మార్ట్ ఫోన్లు కూడా కారణమని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని దంపతుల మధ్య దాపరికాలు పెరిగిపోతున్నాయి. కట్టుకున్న భార్యను కడతేర్చడం, వివాహేతర సంబంధాల కోసం ఎన్నో నేరాలకు పాల్పడే వారు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతే.. విషయం భార్యకు తెలిసి చితక్కొట్టింది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతానికి చెందిన కిషన్ స్థానికంగానే ఓ సెల్ ఫోన్ షాపులో పని చేస్తున్నాడు. కిషన్‌కు 2017లో రేవతి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఉన్నంతలో వీరి జీవితం సాఫిగానే సాగుతుంది. కిషన్‌కు ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. 
 
ఏకంగా ఆ మహిళతో రత్నగిరిలోనే వేరు కాపురం పెట్టాడు. త్వరలోనే ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయం రేవతికి తెలిసింది. కిషన్ మహిళతో కలిసుండగా పక్కా సమాచారంతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా వారిని రేవతి పట్టుకుంది. ఆమెతో వచ్చిన బంధువులంతా కలిసి కిషన్‌కు, ఆయన ప్రియురాలికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.