శనివారం, 30 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 మే 2021 (22:40 IST)

రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. రూ.98లతో అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా

ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తన పోర్ట్ ఫోలియోలో కొత్త ప్లాన్‌ను యాడ్ చేసింది. అన్‌లిమిటెడ్ లాభాలను తీసుకువచ్చే కొత్త రూ. 98 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా లిమిట్‌తో వస్తుంది.
 
ఈ జియో రూ. 98 ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ తో వస్తుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌలభ్యం అందుతుంది. అలాగే, రోజుకు 1.5 GB హై స్పీడ్ 4G డేటా కూడా లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది. 
 
అయితే, ఈ Jio రూ. 98 ప్లాన్‌తో ఎటువంటి ఉచిత SMS సర్వీస్‌ను ఇవ్వడం లేదు. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, 14 రోజులకు గాను మొత్తంగా 21GB హై స్పీడ్ డేటాని అందుకుంటారు.
 
ఇక ఇటీవల ప్రకటించిన కొత్త రూ.39 మరియు రూ.39 ప్లాన్స్ విషయానికి వస్తే, రూ.39 ప్రీపెయిడ్ ప్లాన్ తో మీకు రోజు 100MB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అధనంగా, అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. 
 
రోజువారీ డేటా లిమిట్ తరువాత స్పీడ్ లిమిట్ 64Kbps కు తగ్గించబడుతుంది. అయితే,ఈ ప్లాన్ ముగిసిన తరువాత మరొక ప్లాన్ మీకు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తరవాత దాన్ని వాడుకోవచ్చు.