ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (08:41 IST)

డ్రైవర్ లేకుండానే కాశ్మీర్ టు పంజాబ్ వరకు గూడ్సు రైలు పరుగులు...

goods train
పైలెట్, లోకో పైలెట్ చేసిన చిన్న పొరపాటు వల్ల ఓ గూడ్సు రైలు డ్రైవర్లు లేకుండానే ఏకంగా కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు పరుగులు తీసింది. మొత్తం 53 వ్యాగన్లతో కూడిన ఈ రైలు సగటున 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి కలకలం సృష్టించింది. ఈ గూడ్సు రైలు వెళుతున్న సమయంలో ఎలాంటి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్‌ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకాశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R) జమ్మూలోని కథువా రైల్వేస్టేషన్‌లో కొంతసేపు ఆగింది. అయితే, లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే రైలింజన్ నుంచి దిగిపోయారు. 
 
పైగా, పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ ఏటవాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. అలా కదిలిన ఈ గూడ్సు రైలు.. గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికు ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.