శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (13:23 IST)

భార్యను కట్నం కోసం కాలుతున్న కట్టెతో కొట్టాడు.. యాసిడ్ పోశాడు.. ముఖంపై పడిందా?

భార్యపై ఓ భర్త యాసిడ్ పోశాడు. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలాపుఝా జిల్లాకు చెందిన 31 ఏళ్ల భార్యపై భర్త, అ

భార్యపై ఓ భర్త యాసిడ్ పోశాడు. అదనపు కట్నం కోసం భార్యను చితకబాదడమే కాకుండా ఆమెపై యాసిడ్ పోశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలాపుఝా జిల్లాకు చెందిన 31 ఏళ్ల భార్యపై భర్త, అత్త తరచూ ఘర్షణకు దిగేవారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ చితకబాదారు. తొమ్మిదేళ్ల క్రితం వీరివివాహం జరిగింది. వివాహ సమయంలో రూ .2లక్షలు, 20 నాణేల బంగారాన్ని కట్నంగా ఇస్తామని తన తల్లిదండ్రులు హామీ ఇచ్చినట్లు బాధిత మహిళ వెల్లడించింది. 
 
అయితే కేవలం బంగారం మాత్రమే ఇవ్వడంతో తనకు వేధింపులు మొదలయ్యాయి. జూన్ ఆరో తేదీ మహిళ భర్త కాలుతున్న కట్టెతో ఆమెను చితకబాదాడు. అనంతరం తీవ్ర గాయాలపాలై నేలపై పడి ఉన్న ఆమెపై యాసిడ్ పోశాడు.
 
అయితే ముఖంపై యాసిడ్ పడకుండా ఆమె తప్పించుకోగలిగింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదుతో భర్త, అత్తపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.