శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (16:28 IST)

ఇన్‌స్టాలో ఫాలోయింగ్ విషయంలో గొడవ.. భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తనకంటే భార్యకు అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లు ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేక పోయాడు. దీనికితోడు భర్తను భార్య బ్లాక్ చేసింది. దీంతో భార్యతో గొడవకు దిగి, ఆమెను హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీ రాజధాని లక్నోకు చెందిన 37 యేళ్ల ఓ వ్యాపారవేత్తకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. వీరిద్దరికీ సోషల్ మీడియా ఉపయోగించే అలవాటు ఉంది. వీరికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి. అయితే, ఇన్‌స్టా ఫాలోయర్ల విషయానికి వస్తే భర్త కంటే భార్యకే అత్యధింగా ఉన్నాయి. దీనికితోడు భర్త ఖాతాను భార్య బ్లాక్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. పైగా, తన భార్యకు ఎవరితోనే అక్రమ సంబంధం ఉందనే అనుమానం భర్తకు వచ్చింది. 
 
ఈ క్రమంలో ఆదివారం పిల్లలతో కలిసి వారిద్దరూ తమ ఎస్‌యూవీ కారులో రాయ్‌బరేలికి బయలుదేరారు. మార్గమధ్యంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌పై వైపు కారును తిప్పాడు. ఇదే విషయంపై వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన భర్త.. భార్య గొంతుకోసి చంపేసాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తమ ముందే తల్లిని చంపారని పిల్లలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్యాపారవేత్తను అరెస్టు చేశారు.