శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (15:01 IST)

రైలులో త్రీ ఇడియట్స్ సీన్: వాట్సాప్ ద్వారా పురుడు పోసిన ఎంబీబీఎస్ విద్యార్థి.. ఎక్కడ?

వాట్సాప్‌తో చాటింగ్‌లు, ఫోటోలు షేర్ చేయడం వంటివి చేసే నేటి యువతకు ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఆదర్శంగా నిలిచాడు. వాట్సాప్ సాయంతో నిండు గర్భిణికి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణం కాపాడాడు. ఈ ఘటన అహ్మదాబాద్ పూ

వాట్సాప్‌తో చాటింగ్‌లు, ఫోటోలు షేర్ చేయడం వంటివి చేసే నేటి యువతకు ఓ ఎంబీబీఎస్ విద్యార్థి ఆదర్శంగా నిలిచాడు. వాట్సాప్ సాయంతో నిండు గర్భిణికి పురుడు పోసి తల్లీబిడ్డల ప్రాణం కాపాడాడు. ఈ ఘటన అహ్మదాబాద్ పూరీ ఎక్స్‌ప్రెస్ నాగపూర్‌కు 30 కిలో మీటర్ల దూరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.... నాగ్‌పూర్‌కు 30 కిలో మీటర్ల దూరంలో రైలు ఉండగా.. రైలులో ప్రయాణీస్తున్న గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె బంధువులు రైలు చైన్ లాగి రైలు ఆపేందుకు ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. వెంటనే టిక్కెట్ కలెక్టర్‌కు విషయం తెలిపినా.. వైద్యులు దొరకలేదు. 
 
అదృష్టం కొద్దీ నాగపూర్‌లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్పటల్‌లో ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అయిన 24 ఏళ్ల విపిన్ అదే బోగీలో ప్రయాణిస్తున్నాడు. వెంటనే స్పందించిన విపిన్ వాట్సప్ ద్వారా తన సీనియర్ డాక్టర్ల సాయంతో ఆమెకు పురుడు పోశాడు. సీనియర్ లేడీ డాక్టర్ సలహాలతో ఆమెకు పురుడు పోశానని.. తనకు ఓ ముసలావిడ సాయం చేసిందని విపిన్ తెలిపాడు. 
 
ప్రసవం చేస్తున్న సమయంలో రైలు బోగిలో అంతా నిశ్శబ్ధంగా ఏం జరుగుతుందోనని టెన్షన్ పడ్డారని.. అయితే క్షేమంగా బేబీ పుట్టడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రైలు నాగపూర్ వచ్చిన తర్వాత అక్కడ వేచి ఉన్న లేడీ డాక్టర్ల బృందం తల్లీబిడ్డల బాధ్యతను తీసుకుని చికిత్సను అందించారు.

వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విపిన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను చూస్తుంటే త్రీ ఇడియట్స్ గుర్తుకొస్తుందని చాలామంది అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు.