సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (13:10 IST)

వామ్మో... వంటిపై అంత బంగారమా... 10 ఉంగరాలతో ఏకంగా 5 కేజీల నగలు

gold
ఇప్పటివరకు కర్నాటకు చెందిన ఓ వ్యక్తి అత్యధిక బరువుతో కూడిన బంగారు నగలు ధరించేవారు. కానీ, ఇపుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ రికార్డును బద్ధలుకొట్టారు. ఈ వ్యక్తి నిలువెల్లా బంగారం ధరించారు. మెడలో 30కు పైగా గొలుసులు, చేతులకు 10 ఉంగరాలు ధరించారు. వీటి బరువు ఏకంగా 5.2 కేజీలు. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రేమ్‌సింగ్ శరీరమంతా బంగారుమయంగా మారింది. మెడలో 30కు పైగా గొలుసులు, రెండు చేతులకు కలిపి 10 ఉంగరాలతో ఏకంగా 5.2 కేజీల నగలను ఆయన ఒంటిపై ధరిస్తున్నారు. కళ్లద్దాలు, మొబైల్ కవర్.. ఇలా అన్నింటికీ బంగారమే. ఎక్కడికి వెళ్లినా ఈ ఆభరణాలన్నీ ధరించే వెళ్తారు. భోజ్‌పూర్‌కు చెందిన ప్రేమ్‌‍సింగ్ చిన్ననాటి నుంచే బంగారం అంటే ఆసక్తి. ఈ అభిరుచి వయసుతోపాటు మరింత ఎక్కువైంది. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, 'భూస్వామ్య కుటుంబంలో పుట్టిన నేను ప్రస్తుతం కాంట్రాక్టరుగా పనిచేస్తున్నా. వచ్చిన ఆదాయంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటా. వేడుకలకు వెళితే ప్రజలు నాతో సెల్ఫీలు తీసుకోవడం చూసి ఆనందంగా ఉంటుంది' అని ప్రేమింగ్ చెబుతుంటారు.