శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (07:56 IST)

మళ్లీ మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధం

జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని అధికారులు మరోసారి గృహనిర్బంధం విధించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

బుద్గామ్‌లో అధికారులు ఖాళీ చేయించిన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను గృహంలో నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతున్న ప్రతిపక్షాలపై చట్టవ్యతిరేకంగా నిర్బంధం విధించి.. వారిని గందరగోళానికి గురిచేయడం మోడీ సర్కార్‌ తన విధిగా మార్చుకుందని విమర్శించారు.

'నేను మరోసారి నిర్భంధించబడ్డాను.. కారణం బుద్గామ్‌లో తమ ఇళ్ల నుండి బలవంతంగా ఖాళీ చేయబడ్డ వందలాది మంది బాధితుల్ని పరామర్శించాలనుకోవడమే' అని ట్వీట్‌ చేశారు. శ్రీనగర్‌లో తన ఇంటి గేట్లకు తాళం వేసి ఉన్న దృశ్యాలను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. జమ్ముకాశ్మీర్‌ ప్రజలపై అణిచివేత కొనసాగుతోందని ఆమె మండిపడ్డారు.