నేడు రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల భేటీ

ramnadh kovindh
ఎం| Last Updated: బుధవారం, 9 డిశెంబరు 2020 (07:50 IST)
రైతుల ఆందోళన నేపథ్యంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో సమావేశం కానున్నారు. సిపిఎం, సిపిఐ లతో పాటు ఎన్‌సిపి, డిఎంకె, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌లు ఈ బ్లాక్‌ఫామ్‌ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నాయి.

కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను, రైతుల వ్యతిరేకతకు గల కారణాలను రాష్ట్రపతికి వివరించనున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, శరద్‌పవార్‌, రాహుల్‌గాంధీ, డిఎంకె నుండి టికెఎస్‌. ఎలంగోవన్‌లు రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.

కరోనా నిబంధనల నేపథ్యంలో రాష్ట్రపతిని కలిసేందుకు ఐదుగురికి మాత్రమే అవకాశం ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కాగా, ప్రతిపక్షాలు రాష్ట్రపతితో సమావేశానికి ముందు వివాదాస్పద చట్టాలపై సమిష్టి వైఖరిని రూపొందించుకుంటాయని నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌పవార్‌ అన్నారు.
దీనిపై మరింత చదవండి :