శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 జూన్ 2019 (11:06 IST)

కారు దిగిన మోడల్‌ను చుట్టుముట్టి వేధించిన బైకర్లు.. ఎక్కడ?

మహిళలపై ఎక్కడపడితే అక్కడ వేధింపులు జరుగుతున్నాయి. తాజాగా ఓ మోడల్ రోడ్డుపై నిల్చున్నా ఆమెకు వేధింపులు తప్పలేదు. స్నేహితురాలితో కలిసి క్యాబ్‌లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో కారు దిగిన ఆ మోడల్‌కు ఇబ్బందులు తప్పలేదు. ఆమెను చుట్టుముట్టిన బైకర్లు వేధించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్ ఉషోషి సేన్ గుప్తాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. గత రాత్రి 11.40 గంటల సమయంలో ఓ మీడియా ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఉషోషి, ఉబర్ కారులో ఇంటికి వెళుతుండగా.. ప్రమాదం జరిగింది. కారు ఓ బైకుకు తగిలి అద్దం పగిలింది. అంతే.. క్షణాల వ్యవధిలో పది మంది బైకర్లు వారి కారును చుట్టుముట్టారు. డ్రైవర్ ను వదిలేసి, ఆమెను వేధించారు. 
 
ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. బైకర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.