శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (20:09 IST)

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ

Modi-Putin
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను స్వాగతించి ప్రధాని.. ఆయనతో భేటీ అయ్యారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక , రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకున్నప్పటికీ భారత్, రష్యాల స్నేహం స్థిరంగా ఉందన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్, రష్యా మధ్య సంబంధం మారలేదన్నారు మోదీ. 
 
అలాగే తాము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా..  మిత్రదేశంగా భావిస్తున్నామన్నారు వ్లాదిమిర్ పుతిన్. తమ దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. ఈ  ఇరువురు నాయకులు 21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం నిర్వహించనున్నారు.
 
కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ భారత్, రష్యాల మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పు లేదని మోదీ పేర్కొన్నారు. ఇరు పక్షాల మధ్య ప్రత్యేక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, ఇతర అంశాలపై ఇరుపక్షాలు సంప్రదింపులు జరుపుతున్నాయని మోదీ అన్నారు.